మోజర్లలో పోషణ పక్షం ప్రారంభం - బాలల ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమాలు.

మోజర్లలో పోషణ పక్షం ప్రారంభం - బాలల ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమాలు.

పెద్దమందడి,ఏప్రిల్18(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో పోషణ పక్షం వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి, 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఆరోగ్యం, పోషణ, మెదడు అభివృద్ధి వంటి కీలక అంశాలపై తల్లిదండ్రులకు సమగ్ర సమాచారం అందించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, చిన్నారుల శారీరక–మానసిక అభివృద్ధికి సమతుల్య పోషకాహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సరైన ఆహారపు అలవాట్లు చిన్న వయస్సులోనే అలవరచడం ద్వారా భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణానికి దోహదపడుతుందని వివరించారు.పోషణ పక్షం వారోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు 15 రోజులపాటు కొనసాగనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు ఆరోగ్య, పోషణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆర్. రాములు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగరాణి, అంగన్వాడీ టీచర్లు శారద, సువర్ణ, వార్డు సభ్యురాలు నాగమనెమ్మ, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బంది, గ్రామంలోని తల్లులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .