బోటి గుట్టపై మల్లన్న జాతర జోష్.

భోనాలు, పట్నాలతో సిర్సపల్లి ఉత్సాహం

బోటి గుట్టపై మల్లన్న జాతర జోష్.

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
 
హుజురాబాద్ మండలం సిర్సపల్లిలోని బోటి గుట్ట వద్ద వెలసిన స్వయంభు ఐలోని మల్లన్న స్వామి ఆలయంలో ఆదివారం భోనాలు, పట్నాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. జాతర సందర్భంగా పరిసర గ్రామాలైన రంగాపూర్, రాంపూర్‌కు చెందిన మహిళలు సంప్రదాయ దుస్తుల్లో తలపై భోనాలు ఎత్తుకొని గ్రామ వీధుల గుండా ఊరేగిస్తూ భక్తి పరవశంతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఒగ్గు కళాకారులు ఒగ్గు కథలను వినిపిస్తూ, ఒగ్గు డోలు మోగిస్తూ మల్లన్న స్వామి మహిమను గాన రూపంలో వినిపించారు. కోలాటం ప్రదర్శనలు, జానపద కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
భక్తులు సంప్రదాయం ప్రకారం మొక్కులు చెల్లించుకుంటూ, స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. మొత్తం మీద సిర్సపల్లిలో మల్లన్న జాతర భక్తి, సంప్రదాయం, సంస్కృతి కలబోతగా వైభవంగా కొనసాగింది.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .