పీపుల్స్ మార్చ్ మూడేళ్ల సభకు ఖమ్మం నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు

పీపుల్స్ మార్చ్ మూడేళ్ల సభకు ఖమ్మం నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు

భట్టి పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో చారిత్రాత్మకం

 : నూతి సత్యనారాయణ గౌడ్

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు)

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పిప్పిరిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, ఆ సభకు హాజరయ్యేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కూడా శ్రేణులతో కలిసి సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, 2023 మార్చి 16న ప్రారంభమైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచిందన్నారు. 108 రోజుల పాటు 17 జిల్లాలు, 36 నియోజకవర్గాలు, 750 గ్రామాల మీదుగా 1362 కిలోమీటర్ల మేర మండుటెండలోనూ, అకాల వర్షాల మధ్యనూ భట్టి విక్రమార్క సాగించిన ఈ పాదయాత్ర ప్రజల్లో విశేష ఆదరణ పొందిందన్నారు. ఆరోగ్యం క్షీణించినా లెక్కచేయకుండా, అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో భట్టి చూపిన దీక్ష, పోరాటస్ఫూర్తి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అలాగే ఈ పాదయాత్ర 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపి, క్షేత్రస్థాయిలో పార్టీకి కొత్త ఊపిరి పోసిందన్నారు. ఒక సైనికుడు యుద్ధరంగంలోకి దిగిన ధైర్యంతో భట్టి విక్రమార్క ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్‌కు మళ్లీ ప్రజా మద్దతు తెచ్చిన నాయకుడిగా నిలిచారని కొనియాడారు. ఈ సభ కూడా అదే పోరాట స్ఫూర్తిని మరోసారి గుర్తు చేసే వేదికగా నిలుస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రంగా జనార్ధన్, కూరపాటి కిషోర్, యువజన కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు వేజండ్ల సాయి కుమార్, మొక్క శేఖర్ గౌడ్, భానోత్ బాలాజీ నాయక్, కోసూరి శ్రీనివాస్, నూతి వెంకటేశ్వరరావు, మూడుముంతల గంగరాజు యాదవ్, బాబు జానీ, గజ్జి సూర్యనారాయణ, గుమ్మా రోశయ్య, వేల్పుల మురళి, శేఖర్, జెర్రిపోతుల అంజనీ కుమార్, బోయిన వేణు, రాజీవ్ గాంధీ, గోపాల రావు, పెరుగు ప్రసాద్, పోతురాజు సురేష్, ప్రసాద్, కేతేపల్లి నాగేశ్వరరావు, గుడివాడ వెంకటేశ్వర్లు, చింతల రామకృష్ణ, రాము, కోటేశ్వర రావు, కృష్ణారావు తదితరకాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20260406-WA0053

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రోటోకాల్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రోటోకాల్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు) కల్లూరు మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ ప్రెస్ మీట్‌తో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై...
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం భారీ స్థాయిలో సంబరాలు
పీపుల్స్ మార్చ్ మూడేళ్ల సభకు ఖమ్మం నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు
ప్రజలకు అందించిన నిర్విరామ సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు...
వేలేరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం – ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ
ప్రమాదకరంగా మారిన పీచర మూలమలుపు – వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్