యాదవ సంఘం కమ్యూనిటీ హాల్‌కు రూ.22 లక్షలు నిధులు మంజూరు

యాదవ సంఘం కమ్యూనిటీ హాల్‌కు రూ.22 లక్షలు నిధులు మంజూరు

– సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

_నెమలి అనిల్ కుమార్ హర్షం వ్యక్తం

ఉప్పల్, ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు): 

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్  శక్తి సాయి నగర్ డివిజన్‌ పరిధిలోని యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.22 లక్షలు మంజూరు చేసిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ వద్ద జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలను గుర్తించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం అభినందనీయమని తెలిపారు. యాదవ సంఘం అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రాంత అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యాదవ సంఘం సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. యాదవ సంఘం సభ్యులు యెల్లేష్ యాదవ్, రాజ్‌కుమార్ యాదవ్, మల్లి యాదవ్, కుమార్ యాదవ్, మధు యాదవ్, వినేష్ యాదవ్ పాల్గొన్నారు.అలాగే ఉమ్మడి మల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు కప్పర సాయి కిరణ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, దంతూరి రాజు గౌడ్, కోయిగుర బాలరాజ్ గౌడ్, ఎస్‌వి కిట్టు, వి. శ్రీనివాస్, మనోహర్, పంజాల శ్రీను, జానీ వేణు, నిక్కీ గౌడ్, టిల్లూ ముదిరాజ్, జాని భాయ్, విజయ్ రెడ్డి, ఫిరోజ్, అన్వర్, జయంత్ గౌడ్, రింకు తదితరులు పాల్గొన్నారు.మహిళా నాయకురాళ్లు జమీలా బేగం, శైలజ, సునీత, లావణ్య కూడా కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.చివరగా ప్రజల అభివృద్ధి కోసం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, శక్తి సాయి నగర్ ప్రాంత అభివృద్ధికి తమ వంతు కృషి కొనసాగుతుందని నెమలి అనిల్ కుమార్ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .