పెద్ద చెర్లపల్లిలో ఉచిత వైద్య శిబిరం

పెద్ద చెర్లపల్లిలో ఉచిత వైద్య శిబిరం

_500 మందికి పైగా ప్రజలకు పరీక్షలు 

– ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

చర్లపల్లి, ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు):

పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చెర్లపల్లి బస్ స్టాప్ వద్ద నాయకుడు కడియాల పోచయ్య జ్ఞాపకార్థం అపోలో వైద్యశాల సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చర్లపల్లి అభివృద్ధికి కడియాల పోచయ్య చేసిన సేవలను గుర్తు చేసుకోవాలని సూచించారు.ఈ శిబిరంలో 500 మందికి పైగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.కార్యక్రమంలో మల్కాజ్గిరి అదనపు కమిషనర్ వెంకటరమణ, చైర్మన్ గోవింద్ రెడ్డి, మాజీ చైర్మన్లు హరీష్ రెడ్డి, రోషి రెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పావని మణిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .