కంఠమయ్య గుడి అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేయాలి

_మేడ్చల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి

కంఠమయ్య గుడి అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేయాలి

కుషాయిగూడ, ఏప్రిల్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

కుషాయిగూడలో గౌడ కులస్థుల ఆరాధ్యదైవంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కంఠమహేశ్వర స్వామి (కంఠమయ్య) ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆలయంలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఆలయ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ వినతిపై సానుకూలంగా స్పందిస్తూ, త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ సీనియర్ నాయకులు పాండల శివకుమార్ గౌడ్, బీఆర్‌ఎస్ అధ్యక్షులు నేమురి మహేష్ గౌడ్, తాళ్ల వెంకటేష్ గౌడ్, బుడంపల్లి రఘు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .