పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే

పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

వనపర్తి,ఏప్రిల్ 01(తెలంగాణ ముచ్చట్లు):

పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాల అమలులో వేగం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.ఇప్పటివరకు 15 విడతల్లో మొత్తం 12,082 మంది లబ్ధిదారులకు రూ. 714 కోట్లకు పైగా చెక్కుల రూపంలో అందించామని తెలిపారు. ఇందులో సీఎంఆర్ఎఫ్ ద్వారా వేలాది మందికి, కల్యాణ లక్ష్మి పథకం ద్వారా పేద ప్రజల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామని వివరించారు.అదనంగా అత్యవసర వైద్యం కోసం కూడా పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులు అందించినట్లు తెలిపారు.మహిళల సాధికారత కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తున్నామని, వనపర్తి నియోజకవర్గంలోనే భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ప్రతి కుటుంబానికి భద్రత కల్పించే బీమా పథకాలు, కొత్త పింఛన్లు, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.రైతులకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, పంటలకు ప్రోత్సాహకాలు వంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వల్లే నేడు రైతులకు నీరు అందుతున్నదని, వాటిపై ఇతరులు కీర్తి తీసుకోవడం సరికాదని విమర్శించారు.రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, సంక్షేమం మరియు అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, కౌన్సిలర్లు, సర్పంచులు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేలు జరిమానా భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేలు జరిమానా
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్1(తెలంగాణ ముచ్చట్లు) క్షణికావేశంలో భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేల రూపాయలు జరిమానా విదిస్తూ 4వ అదనపు జిల్లా మరియు...
హుజురాబాద్ డివిజన్‌కు నూతన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
సిర్సపల్లి డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ముమ్మరం
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం కలెక్టర్‌కు వినతిపత్రం
స్టార్ హాస్పిటల్‌లో గురుక్కల్‌ను పరామర్శించిన ఎమ్మెల్యేలు
వార్డుల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి:రిహానా కమల్ పాషా.
నేరెడ్‌మెట్‌లో ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్ ప్రారంభం