హుజురాబాద్‌కు మరిన్ని బస్సులు… రవాణా సదుపాయాల కోసం ప్రణవ్ వినతి

హుజురాబాద్‌కు మరిన్ని బస్సులు… రవాణా సదుపాయాల కోసం ప్రణవ్ వినతి

హుజురాబాద్ టౌన్ మార్చ్ 31 (తెలంగాణ ముచ్చట్లు):

హుజురాబాద్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలని కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ప్రస్తుతం కొన్ని మార్గాల్లో మాత్రమే బస్సు సర్వీసులు నడుస్తున్నాయని, అయితే పలు గ్రామాలు ఇంకా సరైన రవాణా సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నాయని ప్రణవ్ వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే కొత్త మార్గాల్లో బస్సు సర్వీసులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా హుజురాబాద్ డిపో అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కూడా కోరారు. డిపో బలోపేతం అయితే మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
ప్రణవ్ వినతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. త్వరలోనే సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఈ పరిణామంతో హుజురాబాద్ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .