వైభవంగా బంగారు మైసమ్మ దేవాలయ వార్షికోత్సవం
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు
నాచారం, మార్చి 29 (తెలంగాణ ముచ్చట్లు):
నాచారం డివిజన్ శ్రీరామ్ నగర్‌లోని బంగారు మైసమ్మ దేవాలయం వార్షికోత్సవం ఆదివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. త్వరలోనే పటేల్ కుంట చెరువును సుందరీకరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఎర్రగుంట, శ్రీరామ్ నగర్, గాంధీనగర్, అంబేద్కర్ నగర్, ఎరుకల బస్తి, బాబా నగర్, నాచారం విలేజ్, హనుమాన్ నగర్, రామ్ రెడ్డి నగర్ ప్రాంతాల్లో దోమల సమస్యను నివారించే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, మేడల మల్లికార్జున గౌడ్, విఠల్ యాదవ్, రామ్ చందర్, కట్ట బుచ్చన్న గౌడ్, అంజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.


Comments