డ్రగ్స్ రహిత సమాజం మన అందరి ధ్యేయం 

పోలీస్ కమిషనర్ సునీల్ దాత్

డ్రగ్స్ రహిత సమాజం మన అందరి ధ్యేయం 

ఖమ్మం బ్యూరో, మార్చి 24(తెలంగాణ ముచ్చట్లు )

డ్రగ్స్ రహిత సమాజం మన అందరి ధ్యేయమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్దాల నియంత్రణపై అవగాహన సదస్సు కార్యక్రమం ముదిగొండ మండలం మేడేపల్లి నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన పెంచి జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడానికి ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ కి బానిసలూ కాకుంటే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చన్నారు. మాదకద్రవ్యాల వినియోగం తీవ్రమైన సామజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తాయన్నారు. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలు, స్నేహితులపై నిఘా ఉంచి వారి కదలికలను గమనిస్తూ ఉండాలన్నారు. విద్యార్థిని విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతం ఆల్కహాల్ వినియోగం ఫ్యాషన్ గా మారిపోయిందని ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు. ముఖ్యంగా యువత విద్యపై దృష్టి కేంద్రీకరించాలని, డ్రగ్స్ వినియోగం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.  ఎక్కడైనా గంజాయి, గ్రామాల్లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించి సమాచారం తెలిస్తే తక్షణమే 1908 లేదా పోలీస్ వారికి తెలియజేస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా  పోస్టర్లు ఆవిష్కరించారు. ప్రతిజ్ఞ చేశారు. 
కార్యక్రమంలో రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, సిఐ మురళి, నార్కోటిక్ ఏసీపీ సోమనాధం, ఎస్సై సంతోష్,సామినేని వెంకటేశ్వరరావు గ్రామ పెద్దలు, చెరుకుపల్లి జగన్నాథం సర్పంచ్ మేడిపల్లి, తోట వెంకటేశ్వర్లు సర్పంచ్కట్టుకూరు, కందుల బాలచందర్ వెంకటాపురం సర్పంచ్, పాల్గొన్నారు. IMG-20260324-WA0062

Tags:

Post Your Comments

Comments

Latest News