పరాభవ నామ సంవత్సరంలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి

మాజీ  ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి

పరాభవ నామ సంవత్సరంలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి

వనపర్తి,మార్చి20(తెలంగాణ ముచ్చట్లు): 

పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వనపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అనావాయితీగా ప్రముఖ పండితులు, పంచాంగ సిద్ధాంతకర్త మనోహర్ శర్మ మరియు వారి కుమారులు నాగరాజు శర్మలను వారి స్వగృహంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ ప్రజల జీవన విధానానికి మార్గదర్శకంగా నిలిచే పంచాంగాన్ని రచించడం అత్యంత అభినందనీయమని కొనియాడారు. పంచాంగం ద్వారా సమాజానికి శుభాశుభాలను తెలియజేయడం గొప్ప సేవ అని పేర్కొన్నారు. పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, పలుస శంకర్ గౌడ్, ప్రేమ్ నాథ్ రెడ్డి, ఎం.డి. గౌస్, నందిమల్ల రమేష్, కిషోర్ కుమార్ రెడ్డి, పార్థసారథి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిన్నగుంటపల్లెలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు చిన్నగుంటపల్లెలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు
వనపర్తి,మార్చి20(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి మండలం చిన్నగుంటపల్లె గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది.టోర్నమెంట్ చివరి...
భక్తి భజన సంకీర్తనలే సన్మార్గానికి మార్గం
ప్రభుత్వ పాఠశాలలో సేవా కార్యక్రమాలతో కాష్యపి రెడ్డి జన్మదిన వేడుకలు
వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను నేర్చుకున్న ఎల్కతుర్తి రైతులు
దోమల నివారణపై డీసీ స్పందన… కాప్రా ప్రజల్లో హర్షం
అకస్మిక తనిఖీతో వెలుగులోకి లోపాలు… చర్యలకు డీఎంహెచ్‌ఓ ఆదేశం
వనపర్తి జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఐ. సత్య రెడ్డి నియామకం