అకస్మిక తనిఖీతో వెలుగులోకి లోపాలు… చర్యలకు డీఎంహెచ్‌ఓ ఆదేశం

అకస్మిక తనిఖీతో వెలుగులోకి లోపాలు… చర్యలకు డీఎంహెచ్‌ఓ ఆదేశం

జమ్మికుంట టౌన్ మార్చ్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

రానున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందస్తు సమాచారం లేకుండా చేసిన ఈ సడన్ విజిట్‌లో ఆసుపత్రిలోని పలు లోపాలు వెలుగులోకి వచ్చాయి.
వ్యాక్సిన్ రూమ్ నుంచి ల్యాబ్ వరకు ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, మందుల నిల్వలు మరియు రోగులకు అందుతున్న సేవలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫార్మసీలో అవసరమైన మందులు సమృద్ధిగా అందుబాటులో ఉండాలని, రోగి చేతిలో ప్రిస్క్రిప్షన్ మాత్రమే కాకుండా మందు కూడా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.
లేబర్ రూమ్ పరిశీలనలో పరిశుభ్రత లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన డీఎంహెచ్‌ఓ, ఆసుపత్రి పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోగుల చికిత్సలో నిర్లక్ష్యం అసలు సహించబోమని హెచ్చరించారు.
బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున అత్యవసర వైద్య సదుపాయాలు, అంబులెన్స్ సేవలు, అవసరమైన మందుల నిల్వలు పూర్తిగా సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ అకస్మిక తనిఖీతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమవగా, లోపాలను సరిదిద్దే చర్యలు వేగవంతం అవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .