జీవిత పోరాటంలో ఓడిపోయిన యువకుడు

జీవిత పోరాటంలో ఓడిపోయిన యువకుడు

జమ్మికుంట టౌన్, మార్చ్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కేశవపూర్‌కు చెందిన పాతకాల కిషన్ (30) కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చెల్లెలి వివాహం కోసం చేసిన ఖర్చులు, తండ్రి అనారోగ్య చికిత్సకు వచ్చిన భారంతో కుటుంబ పరిస్థితి మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కిషన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుని తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్థిక ఇబ్బందులే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కిషన్ మృతి కుటుంబానికి తీరని లోటుగా మారింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆటపాటలతో కళకళలాడిన కొత్తపల్లి బోనాలు ఆటపాటలతో కళకళలాడిన కొత్తపల్లి బోనాలు
హుజురాబాద్, మార్చి 19: (తెలంగాణ ముచ్చట్లు)  హుజురాబాద్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పోచమ్మ బోనాలు ఉత్సవం ఆటపాటల నడుమ ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారిని...
జీవిత పోరాటంలో ఓడిపోయిన యువకుడు
మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ
కాప్రా డీసికి మొరపెట్టుకున్నా స్పందన లేదని ప్రజలు ఆవేదన
కుషాయిగూడలో మహిళ అదృశ్యం
కీసరగుట్టలో ఘనంగా భవాని రామలింగేశ్వర స్వామి పల్లకి సేవ
విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం