కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలి 

బీజేపీ మండల అధ్యక్షుడు బైరపాక కుమార్ డిమాండ్ 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలి 

ధర్మసాగర్, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ధర్మసాగర్ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు హామీలను తక్షణమే పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల రెవెన్యూ అధికారి సదానందంకు వినతిపత్రం సమర్పించారు.మండల అధ్యక్షుడు బైరపాక కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే హామీలను స్పష్టమైన కార్యాచరణతో అమలు చేయాలని, ఇందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వల్ల నిరాశ నెలకొంటోందని, ప్రభుత్వం వాటి అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన గ్యారెంటీలను వాయిదా వేయకుండా దశలవారీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ కదుగాయ రమేష్, మండల ప్రధాన కార్యదర్శి సాయం సందీప్, మండల ఉపాధ్యక్షుడు మోర్ రాజేందర్, బీజేవైఎం అధ్యక్షుడు గాజా శ్యాంసుందర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మాచర్ల అనిరుధ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు పెసరు వెంకటేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గంగారపు రమేష్, సీనియర్ నాయకులు దుస్సా రాములు, సాంబరాజు, శ్రీదర్, సంపత్, వెంకన్న, గట్టుమళ్ళు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .