సీఆర్పీల సమస్యలు పరిష్కరించాలి.!

సీఆర్పీల సమస్యలు పరిష్కరించాలి.!

- ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసిన సీఆర్పీ యూనియన్ నాయకులు.
- పర్మినెంట్ చేయాలని, టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్.

దమ్మపేట, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):

సీఆర్పీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం దమ్మపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రవీందర్ రెడ్డి గారికి సీఆర్పీ యూనియన్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర సీఆర్పీ యూనియన్ కమిటీ పిలుపు మేరకు మండల అధ్యక్షుడు పాడియా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వగ్గేల వెంకటేశ్వరరావుతో కలిసి ఎంపీడీవోకు సీఆర్పీల సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మండల స్థాయిలో ఎమ్మార్పీలుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పని చేసేవారని తెలిపారు. అనంతరం రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుల స్థానంలో బి.ఈడి, టెట్ అర్హతలు కలిగిన అభ్యర్థులను సీఆర్పీలుగా నియమించారని పేర్కొన్నారు. గత 13 సంవత్సరాలుగా కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ, హ్యాబిటేషన్ పరిధిలో ఉన్న బడి బయట పిల్లలను గుర్తించి మళ్లీ పాఠశాలలో చేర్పిస్తూ వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని, వారి తల్లిదండ్రులతో నిరంతరం మాట్లాడి విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా కృషి చేస్తున్నామని చెప్పారు. కొన్నిచోట్ల ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధన కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం తమపై చిన్నచూపు చూస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎం.ఏ, ఎం.ఎస్‌సి / బి.ఎస్‌సి, బి.ఈడి, టెట్ వంటి అర్హతలు ఉన్నప్పటికీ కనీస వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కాంప్లెక్స్ పరిధిలో ఉన్న పాఠశాలలను సందర్శించడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ప్రయాణ ఖర్చులను కూడా తమ స్వంత డబ్బులతోనే భరించాల్సి వస్తోందని వివరించారు. ఈ సందర్భంగా సీఆర్పీలు తమ డిమాండ్లను వెల్లడించారు. సీఆర్పీ ల పేరును క్లస్టర్ రిసోర్స్ టీచర్స్ గా మార్చాలని, సీఆర్పీలను పర్మినెంట్ చేయాలని, అప్పటి వరకు టైం స్కేల్ అమలు చేయాలని కోరారు. ప్రావిడెంట్ ఫండ్ తో పాటు ఆరోగ్య భీమా కల్పించాలని, పాఠశాల సందర్శన సమయంలో ప్రమాదం జరిగితే ప్రభుత్వం ప్రమాద బీమా కింద రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం టర్మినేషన్, రీన్యువల్, బాండ్ అగ్రిమెంట్ వంటి విధానాలు లేకుండా విధులు నిర్వహించే అవకాశం కల్పించాలని కోరారు. రోజుకో పాఠశాల సందర్శన చేయడానికి ట్రావెలింగ్ అలవెన్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ అర్హతలు ఉన్నందున శిక్షణ ఇచ్చి క్లస్టర్ రిసోర్స్ టీచర్స్‌గా గుర్తించాలని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలలో సీఆర్పీలకు 30 శాతం వెయిటేజ్ ఇవ్వాలని కోరారు. అదేవిధంగా అవసరమైన సీఆర్పీలకు జిల్లా మరియు అంతర్ జిల్లా బదిలీల అవకాశం కల్పించాలని, విధుల్లో ఉండగా మరణించిన సీఆర్పీల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఆర్పీల సంఖ్య ఆధారంగా జీతభత్యాల్లో ఉన్న వ్యత్యాసాలను సరిచేయాలని కోరారు. రిటైర్మెంట్ సమయానికి సీఆర్పీలకు కనీసం రూ.20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్లను గత 13 సంవత్సరాలుగా ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తున్నామని, అయితే ఇప్పటివరకు పరిష్కారం కాలేదని తెలిపారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ కంటే ఎక్కువ జీతం, పేరులో మార్పు వంటి అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నారని ఎంపీడీవో దృష్టికి తీసుకువచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌పై అసత్య ప్రచారాలు కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌పై అసత్య ప్రచారాలు
_నిరాధార ఆరోపణలపై కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు _అసోసియేషన్ ప్రతిష్టను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారని ఆరోపణ కుషాయిగూడ, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు): ఉప్పల్ నియోజకవర్గం కాప్రా...
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు నో చెప్పాలి
నాచారంలో సమస్యలపై డిప్యూటీ కమిషనర్‌ కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నేతలు
సీనియర్ పాత్రికేయుడు వెంకటరమణారెడ్డి సంస్మరణ సభ 
వెల్టూర్ సర్పంచ్ అశోక్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
కాప్రా సర్కిల్‌లో దోమల బెడద తీవ్రం వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి
భద్రాద్రి అభివృద్ధిపై మంత్రి తుమ్మల ఫోకస్.!