ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి.

దమ్మపేట తహశీల్దార్‌కు బీజేపీ నాయకుల వినతిపత్రం.

ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి.

దమ్మపేట, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం దమ్మపేట మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేర్చాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఎల్లప్పుడూ పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉడుతనేని విశ్వేశ్వరరావు, గూడ ముత్యాలరావు, తంబళ్ల రవి, మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగరాజు, మండల ఉపాధ్యక్షురాలు కారం రత్నకుమారి, మహిళా మండల అధ్యక్షురాలు కొమ్మినపల్లి రజిత, ఎస్‌టిం మోర్చా మండల అధ్యక్షులు కొరస వీరభద్రంIMG-20260316-WA0025, ఎస్‌సి మోర్చా మండల అధ్యక్షులు సొరకాయల సీతారాములు, మైనార్టీ మోర్చా నాయకులు ఎస్.కే. బాజీ, గంగిశెట్టి ప్రసాద్, పల్లపు శిరీష తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌పై అసత్య ప్రచారాలు కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌పై అసత్య ప్రచారాలు
_నిరాధార ఆరోపణలపై కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు _అసోసియేషన్ ప్రతిష్టను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారని ఆరోపణ కుషాయిగూడ, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు): ఉప్పల్ నియోజకవర్గం కాప్రా...
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు నో చెప్పాలి
నాచారంలో సమస్యలపై డిప్యూటీ కమిషనర్‌ కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నేతలు
సీనియర్ పాత్రికేయుడు వెంకటరమణారెడ్డి సంస్మరణ సభ 
వెల్టూర్ సర్పంచ్ అశోక్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
కాప్రా సర్కిల్‌లో దోమల బెడద తీవ్రం వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి
భద్రాద్రి అభివృద్ధిపై మంత్రి తుమ్మల ఫోకస్.!