కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌పై అసత్య ప్రచారాలు

కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌పై అసత్య ప్రచారాలు

_నిరాధార ఆరోపణలపై కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు

_అసోసియేషన్ ప్రతిష్టను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారని ఆరోపణ

కుషాయిగూడ, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌పై కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అసోసియేషన్ పరిధిలో జరిగిన అగ్నిప్రమాదంపై అంతర్గత విచారణ కొనసాగుతుండగా, కొందరు అసాంఘిక శక్తులు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు.ముఖ్యంగా తాడూరి గగన్ కుమార్ అనే వ్యక్తి అసోసియేషన్‌కు చెందిన జిమ్ సామాగ్రి కనిపించడం లేదని, కొందరు వ్యక్తులు వాటిని స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపిస్తున్నారని సభ్యులు పేర్కొన్నారు.క్షేత్రస్థాయిలో జిమ్ సామాగ్రి భద్రంగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా సరిచూసుకోకుండా పత్రికలు, ఛానళ్లకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని మండిపడ్డారు.వాస్తవాలను ధృవీకరించకుండానే విజయ్ క్రాంతి, మహా న్యూస్, నేడు న్యూస్ మరియు ఇండియన్ క్రానికల్ వంటి పత్రికల్లో అసత్య వార్తలు రావడం పట్ల అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో కూడా సదరు వ్యక్తి అసోసియేషన్ పేరును అప్రతిష్టపాలు చేసేలా వ్యవహరించారని తెలిపారు.
నిరాధార ఆరోపణలతో అసోసియేషన్ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై మరియు తప్పుడు సమాచారాన్ని ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.IMG-20260316-WA0078

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .