హేమాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించిన మంత్రి సీతక్క

హేమాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించిన మంత్రి సీతక్క

రాంపల్లి, మార్చి 15 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఘట్‌కేసర్ మండలం రాంపల్లిదాయర వెంకులో గుట్టపై ఉన్న హేమాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులు స్వీకరించిన మంత్రి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి దేవస్థాన అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య వంటి అంశాలపై అర్చకులు, స్థానిక బాధ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.అలాగే ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రిని కలిసి ఆలయానికి సంబంధించిన సమస్యలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260315-WA0117

Tags:

Post Your Comments

Comments

Latest News