అంబరాన్నంటిన స్మార్ట్ కిడ్జ్ పాఠశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.

అంబరాన్నంటిన స్మార్ట్ కిడ్జ్ పాఠశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.

--చిన్నారులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందించిన నగర మేయర్ పూనకొల్లు నీరజ, కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య, డైరెక్టర్ సుకన్య.

--కనువిందు చేసిన చిరు మువ్వల సందడి. 

ఖమ్మం బ్యూరో, మార్చి 15(తెలంగాణ ముచ్చట్లు)

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే సంబురాలు అంబరాన్నంటాయి. డిజిటల్ లైట్ల వెలుగుల్లో అతిపెద్ద వేదికపై చిన్నారులకు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పట్టాలు అందుకున్న చిన్నారులు మురిసిపోయారు. చిరుమువ్వల సందడితో నృత్యాలు చేస్తూ అతిథులను , తల్లిదండ్రులకు చిన్నారులు స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య పర్యవేక్షణలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు నగర మేయర్ పూనకొల్లు నీరజ ముఖ్యఅతిథిగా హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మేయర్ పూనుకొల్లు నీరజ మాట్లాడుతూ ఈ పాఠశాలలోని చిన్నారులు ఒత్తిడి లేని చదువులతో స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ  గ్రాడ్యుయేషన్ డే పట్టాలు అందుకోవడం హర్షనీయంఅన్నారు. చిన్నారులు స్టేజి పైకి ధైర్యంగా వచ్చి మురిసిపోతూ గ్రాడ్యుయేషన్  పట్టాలు అందుకోవడమే కాకుండా హుషారుగా నృత్యాలు ప్రదర్శించడం ముచ్చటేస్తుందని తెలిపారు. చిన్నారుల నుంచి మొదలుకొని ఐదవ తరగతి విద్యార్థుల వరకు ప్రాథమిక విద్యను అందించడంలో ఖమ్మం నగరంలో తిరుగులేని విద్యాసంస్థగా స్మార్ట్ కిడ్జ్ పాఠశాల విద్యా సేవలు అందించడం గర్వించదగిన విషయం అన్నారు. విద్యార్థులను  ఆల్ రౌండర్ లు గా తీర్చి దిద్దుతున్న స్మార్ట్ కిడ్జ్ పాఠశాలకు తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధతో విద్యను అందించడం వలన గత 14 సంవత్సరాలుగా తల్లిదండ్రులు తమ పాఠశాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ డే అనేది చిన్నారులలో మధుర జ్ఞాపకంగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య మాట్లాడుతూ చిన్నారులపై ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నామని చిన్నారుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రత్యేక విద్యా విధానం ద్వారా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డి ఎం అండ్ హెచ్ ఓ కళావతి భాయి ,స్థానిక కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు . సభలో గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ వేదికపై తమ చిన్నారులకు  స్మార్ట్ కిడ్జ్ పాఠశాల అందిస్తున్న ఒత్తిడి లేని విలువలతో కూడిన విద్యను  నేర్పుతున్న విధానాన్ని ప్రశంసించారు.
అనంతరం చిన్నారులకు గ్రాడ్యుయేషన్  పట్టాలు అందించారు. డిజిటల్ లైట్ల వెలుగుల్లో గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకున్న చిన్నారులు  పలు రకాల సంస్కృతిక కార్యక్రమాలలో కనువిందు చేశారు. సాంప్రదాయ, జానపద, సినిమా పాటలకు స్టెప్పు లేస్తూ  కేరింతలు కొడుతూ వేదికపై సందడి చేశారు. తమ చిన్నారులు గ్రాండ్ గా  వేదికపై గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకోవడం  నృత్యాలతో అలరించడంతో  తల్లిదండ్రులు మురిసిపోయారు.

Tags:

Post Your Comments

Comments

Latest News