మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి

లింగాల కమలరాజు

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి

కొనుగోలు కేంద్రాలు లేక దళారీల పాలవుతున్న మొక్కజొన్న రైతులు

కేసీఆర్ పాలనలో కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలిచాం

ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు)

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంలోనూ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలోనూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఖమ్మం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు విమర్శించారు. శుక్రవారం చింతకాని మండలంలోని నాగులవంచ గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు వంకాయలపాటి సత్యనారాయణ నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింతకాని మరియు బోనకల్లు మండలాలు రాష్ట్రంలోనే అత్యధికంగా మొక్కజొన్న పండించే ప్రాంతాలని తెలిపారు. అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొక్కజొన్నకు రూ. 2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు రూ. 1,600కే కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలంటే వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గతంలో కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎలాంటి ఆపదలేని పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి ‘రాజకీయ కరోనా’ సోకినట్లుగా రైతులను గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జిల్లా మంత్రులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో పంట నష్టం జరిగితే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పొలాల్లోకి వెళ్లి రైతులకు భరోసా ఇచ్చి, నిబంధనలకు అతీతంగా పరిహారం అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరూరా తిరిగి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతు భరోసా కింద రూ. 15 వేల సహాయం ఇస్తామని చెప్పి నేడు మాట తప్పుతున్నారని విమర్శించారు. అలాగే వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్, వికలాంగులకు రూ. 6 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించిన హామీలు కూడా అమలు కావడం లేదని అన్నారు.
రైతు బీమా అందక రైతుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కొత్తగా ఏమీ అడగడం లేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని తెలిపారు. యూరియా కోసం లైన్లలో నిలబడి, కష్టపడి పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు రావడం దురదృష్టకరమని అన్నారు. ఈ సమావేశంలో మంకెన రమేష్, కార్యదర్శి బొడ్డు వెంకట రామారావు, మాజీ ఎంపీపీ పొనుగోటి రత్నాకర్, మాజీ వైస్ ఎంపీపీ గురిజాల హనుమంతరావు, గడ్డం శ్రీనివాస్, వేముల నర్సయ్య, అప్పారావు, బండి రామారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
కొనుగోలు కేంద్రాలు లేక దళారీల పాలవుతున్న మొక్కజొన్న రైతులు కేసీఆర్ పాలనలో కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలిచాం ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు) తెలంగాణ...
ప్రగతి పథంలో పేదల సంక్షేమం
ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి
అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!
వేసవిలో ఆర్టీసీ ప్రయాణికులకు చల్లని కబురు.
శీనన్న మృతి… మండలానికి తీరని లోటు
ఎస్‌సి యాక్షన్ ప్లాన్ 2025–26 కింద స్వయం ఉపాధి పథకాలు