కాప్రాలో పేద ముస్లిం కుటుంబాలకు “ఈద్ కా తోఫా” కిట్ల పంపిణీ
మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి చేతుల మీదుగా పంపిణీ
కాప్రా, మార్చి 13 ( తెలంగాణ ముచ్చట్లు):
రంజాన్ పండుగ సందర్భంగా కాప్రా డివిజన్‌లో పేద ముస్లిం కుటుంబాలకు “ఈద్ కా తోఫా” కిట్లను పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి డివిజన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి కాప్రాలోని “మస్జీద్-ఈ-ఫఖ్రూల్ ఇస్లాం” మసీదులో ముస్లిం సోదర సోదరీమణులకు ఈ కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా స్వర్ణరాజ్ శివమణి మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లిం కుటుంబాలకు “ఈద్ కా తోఫా” కిట్లను పంపిణీ చేస్తోందన్నారు.
కాప్రా డివిజన్‌లోని ప్రతి పేద ముస్లిం కుటుంబానికి ఈ కిట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.మస్జీద్-ఈ-ఫఖ్రూల్ ఇస్లాం మసీద్ ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు మహమ్మద్ ఇలియాజ్, మహమ్మద్ తాహెర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బరినూరి నాగశేషు, మేడ్చల్–మల్కాజ్గిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, జిల్లా ఏఎంసి డైరెక్టర్ పూర్ణ యాదవ్, డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పడమటి మల్లారెడ్డి, పొట్టు బాబురావు, పబ్బతి నరేందర్ గౌడ్, జి సత్యనారాయణ, తన్నీరు శ్రీహరి, టిల్లు యాదవ్, జగదీష్ గౌడ్, మురళీ, తోటకూర శ్రీకాంత్, రిజ్వాన్ ఖాన్, కే రాజు, షాబుద్దీన్, ఏ శ్రీనివాస్, మహమ్మద్ ఆరిఫ్, మహిళా నాయకులు లక్ష్మీ, జ్యోతి, కాప్రా డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, యూత్ నాయకులు ఇమ్రాన్, తరుణ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.


Comments