గాయపడిన మున్సిపల్ కార్మికురాలిని ప్రభుత్వం ఆదుకోవాలి

ఎమ్మార్పీఎస్, మాదిగల ఐక్య నాయకుల డిమాండ్

గాయపడిన మున్సిపల్ కార్మికురాలిని ప్రభుత్వం ఆదుకోవాలి

వనపర్తి ,మార్చి13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి మున్సిపాలిటీకి చెందిన కార్మికురాలు అలివేలు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసి మాదిగ కుల పెద్దలు ఆమెను పరామర్శించారు. స్థానిక నాయకుడు పరంజ్యోతి సమాచారం మేరకు వనపర్తిలోని సుధా నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్న అలివేలును కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.మోటార్ బైక్ ఢీకొనడంతో అలివేలు రెండు చేతుల మోచేతి భాగంలో విరిగినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మాదిగ సామాజిక కార్యకర్త గంధం నాగరాజు, ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాట్లాడుతూ గాయపడిన కార్మికురాలికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని, ఆమెకు జీతంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని అధికారులను కోరారు.అలాగే స్థానిక మున్సిపల్ చైర్మన్ మరియు ఎమ్మెల్యే గారు వెంటనే ఆసుపత్రికి వచ్చి కార్మికురాలిని పరామర్శించి, ఆ కుటుంబాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు గంధం పరంజ్యోతి, గంధం నాగరాజు, రాజనగరం రాజేష్, గోపాలపేట నాగరాజు, కొమ్ము యేసోపు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .