ఎస్‌సి యాక్షన్ ప్లాన్ 2025–26 కింద స్వయం ఉపాధి పథకాలు

-ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ యూనిట్లకు భారీ సబ్సిడీ 

– దరఖాస్తులకు ఆహ్వానం

మేడ్చల్–మల్కాజిగిరి, మార్చి 13 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్/చైర్మన్ ఆదేశాల మేరకు షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థిక పురోగతిని పెంపొందించేందుకు “ఎస్‌సి యాక్షన్ ప్లాన్ 2025–26” కింద పలు పథకాలను అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్‌సి కార్పొరేషన్ అధికారులు తెలిపారు.ఈ పథకం కింద రూ.1 లక్ష వరకు విలువ గల ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలకు 90 శాతం సబ్సిడీ, రూ.3 లక్షల విలువ గల ఎలక్ట్రికల్ త్రిచక్ర ఆటోలు (ప్యాసింజర్/గూడ్స్)కు 70 శాతం సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు. అలాగే రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు విలువ గల సోలార్ యూనివర్సల్ పంప్ కమ్ టూల్ మరియు వ్యవసాయ అనుబంధ యూనిట్లకు రూ.5 లక్షల వరకు 60 శాతం సబ్సిడీతో రుణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.ఉపాధి పథకాల కోసం 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కల అభ్యర్థులు, భూసంబంధిత వ్యవసాయ/సోలార్ పరికరాల పథకాల కోసం 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ/మున్సిపల్ ప్రాంతాలకు రూ.2 లక్షలు మించకూడదని పేర్కొన్నారు.
అభ్యర్థులు కుల ధృవపత్రం, ఒక సంవత్సరంలోపు ఆదాయ ధృవపత్రం, ఆధార్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు (ఎఫ్‌ఎస్‌సి), డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దారిద్ర రేఖకు దిగువన (బిపిఎల్) ఉన్నవారే అర్హులని తెలిపారు.అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 17 నుంచి మార్చి 24, 2026 వరకు టీజీఓబీఎంఎంఎస్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఎస్‌సి కార్పొరేషన్ కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (ఐడిఓసి), మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టరేట్ ను లేదా 040-24020610 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
కొనుగోలు కేంద్రాలు లేక దళారీల పాలవుతున్న మొక్కజొన్న రైతులు కేసీఆర్ పాలనలో కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలిచాం ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు) తెలంగాణ...
ప్రగతి పథంలో పేదల సంక్షేమం
ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి
అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!
వేసవిలో ఆర్టీసీ ప్రయాణికులకు చల్లని కబురు.
శీనన్న మృతి… మండలానికి తీరని లోటు
ఎస్‌సి యాక్షన్ ప్లాన్ 2025–26 కింద స్వయం ఉపాధి పథకాలు