కోర్టు వాయిదాలకు గైర్హాజరు.. నలుగురిని హుజూరాబాద్ జైలుకు తరలింపు.

కోర్టు వాయిదాలకు గైర్హాజరు.. నలుగురిని హుజూరాబాద్ జైలుకు తరలింపు.

భీమదేవరపల్లి:మే30(తెలంగాణ ముచ్చట్లు)

కోర్టు వాయిదాలకు సకాలంలో హాజరుకాని నలుగురు వ్యక్తులను న్యాయమూర్తి ఆదేశాల మేరకు హుజూరాబాద్ జైలుకు తరలించినట్లు ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన వేల్పుల రవీందర్, వేల్పుల వెంకటేష్, చల్లూరి భాస్కర్‌తో పాటు కొప్పూరు గ్రామానికి చెందిన గద్ద రామరాజు తమపై నమోదైన కేసుల విచారణకు సంబంధించి కోర్టు వాయిదాలకు పదేపదే గైర్హాజరవుతున్నట్లు వెల్లడైంది.
కోర్టు విచారణకు ఉద్దేశపూర్వకంగా హాజరుకావడం లేదని గుర్తించిన న్యాయమూర్తి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు సదరు నలుగురిని అదుపులోకి తీసుకుని హుజూరాబాద్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .