ప్రసవం సజావుగానే.. ఉదయానికి శిశువు మృతి.

ప్రసవం సజావుగానే.. ఉదయానికి శిశువు మృతి.

హుజురాబాద్, మే 30 (తెలంగాణ ముచ్చట్లు):

సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన రమ్య అనే గర్భిణి ప్రసవం కోసం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చేరింది. శుక్రవారం రాత్రి వైద్యులు ఆమెకు సిజేరియన్ శస్త్రచికిత్స నిర్వహించగా, ఆమె ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.
అయితే శనివారం ఉదయం నిద్రలేచి చూసేసరికి శిశువులో ఎలాంటి కదలికలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించగా, పరీక్షించిన వైద్యులు శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు.
రాత్రి వరకు క్షేమంగా ఉన్న నవజాత శిశువు ఉదయానికి మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నారాయణరెడ్డి స్పందిస్తూ, ప్రసవం సజావుగా జరిగిందని, శిశువు జన్మించిన సమయంలో పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపారు. శిశువు మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు అంతర్గత విచారణ చేపట్టామని, వార్డులోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.
నవజాత శిశువు మృతి ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .