బాల్క సుమన్‌పై ఫిర్యాదు.

సత్తుపల్లిలో కాంగ్రెస్ నాయకుల చర్య.

బాల్క సుమన్‌పై ఫిర్యాదు.

సత్తుపల్లి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు): 

ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ నాయకుడు బాల్క సుమన్‌పై సత్తుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. భవనాలు కూల్చండి, కార్యాలయాలు ధ్వంసం చేయండి, రైల్వే పట్టాలు కోయండి అంటూ ప్రజా, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి ప్రేరేపించేలా బాల్క సుమన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు సత్తుపల్లి సీఐకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, సీనియర్ నాయకుడు చల్లగుళ్ల నరసింహరావు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .