పొంగులేటి శీనన్న ఆత్మీయ భరోసా..

బాధిత కుటుంబాలకు అండగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

పొంగులేటి శీనన్న ఆత్మీయ భరోసా..

 ఖమ్మం బ్యూరో, మే 27(తెలంగాణ ముచ్చట్లు )

పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో ని   ధర్మతండా,కేశవాపురం,జీళ్ళచెరువు, గోపాలరావుపేట,చేగొమ్మ, ముత్యాల గూడెం, పోచారం, కిష్టాపురం, తుర్కగూడెం నరసింహుల గూడెం, కొత్తూరు, ఎర్రగడ్డ, గైగోలపల్లి, చౌటపల్లి, బోడియ తండా, లాల్ సింగ్ తండా, సంధ్య తండా గ్రామాల్లో వివిధ కారణాలతో మరణించిన 118 కుటుంబాలకు పి ఎస్ ఆర్  చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (శీనన్న) ఆత్మీయ భరోసా కింద ₹10,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి  వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ,ఇటీవల కాలంలో గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన తాళ్లూరి సరసమ్మ  మరణించిన సందర్భంగా తన కుమారుడు, తాళ్లూరి వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులకు 10000 అందజేశారు...ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, కష్టకాలంలో అందించిన ఈ సహాయం తమకు ఎంతో ఊరటనిచ్చిందని, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్న శీనన్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో  కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి,కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, జిల్లా చెరువు ఉపసర్పంచ్ నల్లమల శేఖర్ ,ఇంటూరి పుల్లయ్య,గాదె ఉపేందర్, జొన్నలగడ్డ రవి,గాదే వెంకటేశ్వర్లు, నల్లమల నవీన్, బత్తుల సత్యనారాయణ బెల్లం సునీల్, అయితగాని రాంగోపాల్ ,మొక్క ఉపేందర్,ఆయా గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది....

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు. ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు.
ఎల్కతుర్తి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు): ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక...
తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రాన్ని విడుదల చేసిన మోత్కుపల్లి .
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.
బాల్క సుమన్‌పై ఫిర్యాదు.
ఉచిత ఆన్లైన్ విద్యను సద్వినియోగం చేసుకోండి - మాజీ ఎంపీ నామ.
ఎన్టీఆర్ జననమే ఒక చరిత్ర : మాజీ ఎంపీ నామ.