మహిళా సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దేశిని కోటి.

మహిళా సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

జమ్మికుంట టౌన్ మే 28 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ గార్ల ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం ద్వారా “మీ రేవంతన్న కానుక” చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దేశిని కోటి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశిని కోటి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా, ఆ బస్సుల యజమానులుగా మహిళలను తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళా సంఘాలకు పక్కా భవనాలు నిర్మించడం, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు వంటి ఉపాధి అవకాశాల్లో మహిళలను భాగస్వామ్యం చేయడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పిట్టల రమేష్, రాజ్‌కుమార్, ప్రశాంత్, శివకృష్ణతో పాటు మహిళా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఆర్పీలు, వీవోలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు. ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు.
ఎల్కతుర్తి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు): ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక...
తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రాన్ని విడుదల చేసిన మోత్కుపల్లి .
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.
బాల్క సుమన్‌పై ఫిర్యాదు.
ఉచిత ఆన్లైన్ విద్యను సద్వినియోగం చేసుకోండి - మాజీ ఎంపీ నామ.
ఎన్టీఆర్ జననమే ఒక చరిత్ర : మాజీ ఎంపీ నామ.