ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.

ఉద్యమ కారుల జెఏసి వ్యవస్థాపకులు పిడమర్తి రవి.

ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.

హైదరాబాద్,మే28(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించడంతో పాటు పింఛన్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు.నాగర్‌కర్నూల్ పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ రహీం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన పిడమర్తి రవి మాట్లాడారు. జూన్ 21న ఇందిరాపార్క్‌లో నిర్వహించే ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని వేలాదిమంది ఉద్యమకారులు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించాలని కోరారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యమకారులు రాములు నాయక్, ధర్మరాజు, గుడిపల్లి రవి, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్, జయశంకర్, బీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ,పోలే నరేందర్, గుడిపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260528-WA0139

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .