తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రాన్ని విడుదల చేసిన మోత్కుపల్లి .

తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రాన్ని విడుదల చేసిన మోత్కుపల్లి .

హైదరాబాద్,మే28(తెలంగాణ ముచ్చట్లు):

జూన్ 21న నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహ విడుదల చేశారు.కొత్తకోట పట్టణంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మోత్కుపల్లి నరసింహ సమ్మేళన కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పింఛన్, గుర్తింపు కార్డులు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ నెల 21న ఇందిరాపార్క్‌లో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముంజగళ్ల విజయ్, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్, ముపురి కుమార్, మీసాల మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .