వెల్టూర్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.

వెల్టూర్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.

పెద్దమందడి,మే28(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవకు ఎన్టీఆర్ మారుపేరుగా నిలిచారని పేర్కొన్నారు.సినీ రంగంలోనూ, రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం కార్యకర్తలతో కలిసి జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దయల రమేష్, మెరుగు కుర్మయ్య, ఆంజనేయులు గౌడ్, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .