ఉచిత ఆన్లైన్ విద్యను సద్వినియోగం చేసుకోండి - మాజీ ఎంపీ నామ.

లక్ష్యంతో చదివి రాణించండి యువతకు మాజీ ఎంపీ నామ పిలుపు.

ఉచిత ఆన్లైన్ విద్యను సద్వినియోగం చేసుకోండి - మాజీ ఎంపీ నామ.

ఖమ్మం బ్యూరో, మే 28(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో “రాకేష్ రెడ్డి ఈ -క్లాస్సేస్ అప్ ”ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందించాలనే లక్ష్యంతో చక్రవర్తి రూపొందించిన ఈ యాప్‌కు ఎనుగుల రాకేష్ రెడ్డి ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమన్నారు. నిపుణుల బోధనతో ఇంటి నుంచే మొబైల్ ద్వారా క్లాసులు వినే అవకాశం ఉందన్నారు. తక్కువ ఖర్చుతో పోటీ పరీక్షలకు సిద్ధమవ్వొచ్చని, యువత క్రమశిక్షణతో చదివి లక్ష్యాలు సాధించాలని సూచించారు. బిట్స్ పిలానీ యూనివర్సిటీ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసిన రాకేష్ రెడ్డి మంచి ఉద్యోగావకాశాలను వదులుకొని స్వగ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు. ప్రతి ఒక్కరి వద్ద ఉన్న మొబైల్‌ను సద్వినియోగం చేసుకొని ఈ యాప్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ విద్యను పొందాలని, పోటీ పరీక్షల్లో రాణించాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, బొల్లం మల్లయ్య యాదవ్, ఆర్జెసి కృష్ణ, సుడా మాజీ చైర్మన్IMG-20260528-WA0141 బచ్చు విజయకుమార్, నాయకులు పగడాల నాగరాజు, నాగండ్ల కోటేశ్వరరావు, లకావత్ గిరిబాబు, మోరంపొడి ప్రసాదరావు, మరికంటి రేణుబాబు, వాకదాని కోటేశ్వరరావు, మాటేటి కిరణ్, రేగళ్ల కృష్ణ ప్రసాద్, షారుఖ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .