ఖాదర్‌ బాబాకు టీడబ్ల్యూజేఎఫ్ సన్మానం.

ఖాదర్‌ బాబాకు టీడబ్ల్యూజేఎఫ్ సన్మానం.

 జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతల స్వీకారం
పఠనాసక్తి పెంపొందించేలా లైబ్రరీలను తీర్చిదిద్దాలని సూచన

ఖమ్మం బ్యూరో, మే 24(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఎండీ ఖాదర్ బాబాను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ - హెచ్ 2843) ఖమ్మం జిల్లా కమిటీ సన్మానించింది. స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చైర్మన్ చాంబర్ లో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు నలుబోల మధులత, అర్షద్, యూనియన్ నాయకులు కొరకొప్పుల రాంబాబు, తదితరులు  చైర్మన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ జ్ఞాపిక, డైరీని అందజేసి శాలువ కప్పి సన్మానించారు. పఠనాసక్తిని  పెంపొందించేలా జిల్లాలోని గ్రంథాలయాలను తీర్చిదిద్దాలని సూచించారు. పత్రికలన్నీ గ్రంథాలయాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రంథాలయాల్లో వసతులు మెరుగుపర్చాలని, డిజిటల్ లైబ్రరీలుగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .