దొడగుంటపల్లి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా జంగం గోపాల్ ఏకగ్రీవ ఎన్నిక.

దొడగుంటపల్లి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా జంగం గోపాల్ ఏకగ్రీవ ఎన్నిక.

పెద్దమందడి,మే15(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా జంగం గోపాల్ (చెన్నప్ప కుమారుడు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుడిగా బూసని శ్రీకాంత్ (ఆంజనేయులు కుమారుడు), కార్యదర్శిగా కే. కృష్ణయ్య (బాలయ్య కుమారుడు), కోశాధికారిగా నందమోని వెంకటయ్య (కరెన్నలు కుమారుడు)లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.శుక్రవారం దొడగుంటపల్లి గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనంలో జిల్లా సహకార సంఘం ఎన్నికల అధికారి కవిత ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు జంగం గోపాల్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు నాగన్న, నందమోని తిరుపతయ్య, జంగం పెద్ద నాగరాజు, జంగం చిన్న గోపాల్, ఆంజనేయులు, బి. ఆంజనేయులు, దండు చిన్న రాములు, దండు చెన్నారాయుడు, దండు పెద్ద కురుమన్న, టైలర్ కురుమయ్య, రాజశేఖర్, తోకల సైదులు, బి. శ్రీనివాసులు, బి. సైదులు, డి. కృష్ణ, జంగం నాగరాజు, జేబి రాములు తదితర సంఘ సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రాణాలు కాపాడే తొలి గంటే “గోల్డెన్ అవర్” ప్రాణాలు కాపాడే తొలి గంటే “గోల్డెన్ అవర్”
రోడ్డు ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించాలిమెడికవర్ వైద్యులు రాజీవ్ రెడ్డి, వేణుగోపాల్ సూచనలు* హుజురాబాద్‌, మే 15(తెలంగాణ ముచ్చట్లు ): రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రమాదం...
డీసీఎం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. జమ్మికుంటలో కేసు నమోదు.
అపర భగీరధుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి ఘన సత్కారం.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి.
దొడగుంటపల్లి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా జంగం గోపాల్ ఏకగ్రీవ ఎన్నిక.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలి
జమ్మికుంట మున్సిపాలిటీలో జీతాల పెంపు పేరిట లక్షల వసూళ్లు..?