పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణం.
పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితి కళావేదిక అధ్యక్షులు .
Views: 8
On
వనపర్తి,మే02(తెలంగాణ ముచ్చట్లు):
ప్రతి సంవత్సరం మే3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ తెలిపారు.1993లో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిందని, 1991లో నమీబియాలోని విండ్‌హోక్‌లో జరిగిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు మద్దతుగా చేసిన ప్రకటనకు గుర్తుగా మే 3వ తేదీని ఎంపిక చేశారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం లేదా ఇతర శక్తుల ఒత్తిళ్లు లేకుండా, భయభ్రాంతులకు గురికాకుండా వార్తలను సేకరించి ప్రజలకు అందించే హక్కే పత్రికా స్వేచ్ఛ అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికా స్వేచ్ఛ మూలస్తంభమని, నిజాలను ప్రజల ముందుంచడం, అధికారులను ప్రశ్నించడం, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తేవడం మీడియా ప్రధాన బాధ్యత అని తెలిపారు.స్వేచ్ఛగా పనిచేసే పత్రికలు లేకపోతే ప్రజాస్వామ్యం నిలబడదని, ప్రజలకు నిజమైన సమాచారం అందినప్పుడే వారు సరైన నిర్ణయాలు తీసుకోగలరని అన్నారు.కుంభకోణాలు, అక్రమాలు వెలుగులోకి రావడంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని, బాధితుల గొంతును ప్రపంచానికి వినిపించేది కూడా మీడియానేనని పేర్కొన్నారు.ప్రస్తుతం జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు, సెన్సార్ విధానాలు, ఫేక్ న్యూస్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దేశాల్లో నిజం రాసినందుకు జర్నలిస్టులు జైలు పాలవుతున్నారని అన్నారు.డిజిటల్ యుగంలో తప్పుడు వార్తలు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడం కేవలం జర్నలిస్టుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా నిజమైన వార్తలను చదవడం, ఫేక్ న్యూస్‌ను నమ్మకపోవడం, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు అండగా నిలవడం అవసరమని తెలిపారు.చివరగా, పత్రికా స్వేచ్ఛ అంటే సమాజ స్వేచ్ఛ. అది ఉంటేనే ప్రజల గొంతు వినిపిస్తుంది అని పేర్కొంటూ ప్రజల పక్షాన నిలబడే ప్రతి జర్నలిస్టుకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments