చిరు వ్యాపారుల అభివృద్ధికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కీలకం.
Views: 6
On
జమ్మికుంట టచ్ ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ ప్రక్రియపై అవగాహన కల్పించే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వినాయక గార్డెన్‌లో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆధ్వర్యంలో, టీఎల్ఎఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ పిడి స్వరూప రాణి, మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఎంతో కీలకమని తెలిపారు. వ్యాపార సంస్థల పెట్టుబడి, వార్షిక టర్నోవర్ ఆధారంగా వాటిని వర్గీకరిస్తూ ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ నమోదు ఒక శాశ్వత గుర్తింపుగా పనిచేస్తుందని వివరించారు.
చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి దారులు తప్పనిసరిగా ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సహాయం, రుణాలు, సబ్సిడీలు వంటి అనేక ప్రయోజనాలు పొందవచ్చని సూచించారు. వ్యాపార వ్యవస్థలో పారదర్శకత పెంపొందించడంలో కూడా ఈ రిజిస్ట్రేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
కరీంనగర్ పిడి స్వరూప రాణి మాట్లాడుతూ మెప్మా ద్వారా చేపడుతున్న ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చిన్న వ్యాపారులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎంసీ శ్రీవాణి, డీపీఎం సతీష్, ఇంచార్జి టీఎంసీ మల్లీశ్వరి, సీఎల్ఆర్పీలు మంజుల, జ్యోతి, ఆర్పీలు, ఓబీలు, శరత్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments