ప్రభుత్వ పాఠశాలల ప్రతిభకు నిదర్శనం.

మద్దిగట్ల–మోజర్ల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో 100% ఫలితాలు

ప్రభుత్వ పాఠశాలల ప్రతిభకు నిదర్శనం.
ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్ రావు

IMG-20260429-WA0083పెద్దమందడి,ఏప్రిల్29(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల–మోజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి ఫలితాల్లో 100% శాతం ఉత్తీర్ణత సాధించి విజయ ఢంకా మోగించింది.ఈ విద్యాసంవత్సరంలో పరీక్షలకు హాజరైన 26 మంది విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత సాధించడం విశేషం.పాఠశాల విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించి ప్రతిభ కనబర్చారు. 500 మార్కులకు పైగా 5 మంది విద్యార్థులు, 400 మార్కులకు పైగా 16 మంది విద్యార్థులు, 350 మార్కులకు పైగా 5 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కుమారి దీప్తి 536 మార్కులతో తెలుగు మీడియం విభాగంలో పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది.ఈ ఫలితాలపై పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు సంతోషం వ్యక్తం చేశారు.విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం ముఖ్య కారణమని పేర్కొన్నారు.ఉపాధ్యాయులు పి. వెంకటస్వామి, గద్వాల కృష్ణయ్య, శ్రీమతి వాణి ప్రభ, పుల్లయ్య, మధుసూదన్, ఎన్. వెంకటస్వామి, ఏ. వెంకటస్వామి, శ్రీనివాసులు, చిన్నారెడ్డి, కృష్ణవేణి అలాగే విశ్రాంత ఉపాధ్యాయులు డి. రణదీవ్, ఎ. భగవంతు విద్యార్థులను అభినందించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం, సాయంత్రం వేళల్లో అల్పాహారం అందించడం, ప్యానెల్ బోర్డుల ద్వారా వీడియో పాఠాలు బోధించడం వంటి చర్యలు ఈ విజయానికి దోహదపడ్డాయని ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు మరియు ఉపాధ్యాయులు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా నాణ్యమైన విద్య అందుతోందని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల అంకితభావం, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, డిజిటల్ బోధన విధానాలు విద్యార్థుల విజయానికి బలంగా నిలుస్తున్నాయని తెలిపారు.అదేవిధంగా గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు కోరారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధనతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
Tags:

Post Your Comments

Comments

Latest News