హుజురాబాద్‌కు ముప్పు డంపింగ్ యార్డ్ .
రద్దుకు ఎమ్మెల్యే గట్టి డిమాండ్ .
Views: 4
On
హుజురాబాద్, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే రద్దు చేయాలని మంత్రి వర్గానికి వినతి పత్రం సమర్పించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, జీవన ప్రమాణాలపై ఈ ప్రాజెక్ట్ తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
డంపింగ్ యార్డ్‌ను గ్రామాలు, పట్టణాల సమీపంలో ఏర్పాటు చేస్తే దుర్వాసన, వాయు కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడంతో తాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అలాగే దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. పరిసర ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పడిపోవడంతో పాటు భూముల విలువలు కూడా తగ్గే పరిస్థితి వస్తుందని చెప్పారు.
ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ డంపింగ్ యార్డ్‌ను వెంటనే రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వినతి పత్రాన్ని తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లురి లక్ష్మణ్‌లకు అందజేశారు.
ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించి వెంటనే డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన తాను ఎప్పుడూ ముందుండి పోరాడుతానని స్పష్టం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
01 May 2026 18:32:58
హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లీ 14వ వార్డుకు చెందిన సటికం సారయ్య గారి తల్లి సటికం నర్సమ్మ గారు వడదెబ్బకు గురై ఈ...


Comments