ప్రజల విశ్వాసం కోల్పోతున్న న్యాయవ్యవస్థ.

డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్.

ప్రజల విశ్వాసం కోల్పోతున్న న్యాయవ్యవస్థ.

ఎల్కతుర్తి, ఏప్రిల్ 28 (తెలంగాణ ముచ్చట్లు):         
                         
 ప్రజలకు న్యాయం అందించాల్సిన వ్యవస్థలపై విశ్వాసం రోజురోజుకు దెబ్బతింటోందని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలీస్ వ్యవస్థలో రాజకీయ జోక్యం, దళారీ వ్యవస్థ పెరగడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కేసులు నమోదు చేయడంలో ఆలస్యం, ఫిర్యాదులను స్వీకరించకపోవడం, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని విమర్శించారు. చట్టం ముందు అందరూ సమానమే అనే రాజ్యాంగ సూత్రం అమలులో లేదని అన్నారు. పోలీస్ స్టేషన్ల వద్ద దళారీ వ్యవస్థ బలపడడంతో బాధితులు నేరుగా ఫిర్యాదు చేయలేక మధ్యవర్తులపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల వల్ల పేదలు, దళితులు, బలహీన వర్గాలు అత్యంత నష్టపోతున్నాయని, న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం క్రమంగా తగ్గిపోతుందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీస్ వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత పెంచే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీస్ శాఖను రాజకీయ ప్రభావం నుంచి విముక్తి చేయడం, ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా నమోదు చేయడం, దళారీ వ్యవస్థను నిర్మూలించడం వంటి సంస్కరణలు చేపట్టాలని సూచించారు. లేనిపక్షంలో ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసం పూర్తిగా దెబ్బతింటుందని, ప్రజా ఉద్యమాలు తీవ్రతరం కావడం అనివార్యమని అన్నారు.
ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి శనిగరం రాజ్ కుమార్, డి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి నిర్మల మనోహర్, బి కే యం యు జిల్లా కార్యదర్శి కర్ర లక్ష్మణ్, నాయకులు చంద్రమౌళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .