హుజురాబాద్‌లో అమరవీరుల స్మారక బ్యారక్ ప్రారంభం .
వీరుల త్యాగాలకు ఘన నివాళి .
Views: 10
On
హుజురాబాద్, ఏప్రిల్ 29(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన అమరవీరుల స్మారక బ్యారక్‌ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం బుధవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమం గంభీర వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. వారి సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, వారి త్యాగాల వల్లనే ప్రజలు నేడు ప్రశాంతంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.
అమరవీరుల జ్ఞాపకార్థం ఈ స్మారక బ్యారక్ నిర్మాణం పోలీస్ శాఖకు గౌరవకరమైన విషయమని అన్నారు. సిబ్బందికి మెరుగైన వసతులు కల్పించడం ద్వారా వారి పనితీరు మరింత మెరుగుపడి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలరని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో కొనసాగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments