బలిదుపల్లి మహిళా సంఘంలో అవినీతి ఆరోపణలు.

బుక్‌కీపర్‌పై విచారణ చేపట్టాలని వార్డ్ సభ్యుడు ఫిర్యాదు.

బలిదుపల్లి మహిళా సంఘంలో అవినీతి ఆరోపణలు.

 

IMG-20260429-WA0069

అడ్డాకల్, ఏప్రిల్29(తెలంగాణ ముచ్చట్లు):

మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని బలిదుపల్లి గ్రామ మహిళా సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యుడు ఆంజనేయులు అధికారులకు బుధవారం ఫిర్యాదు చేశారు. మహిళా సంఘంలో బుక్‌కీపర్‌గా పనిచేస్తున్న ముష్టి శ్రీధర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిధుల వినియోగంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.ఈ మేరకు మహిళా సంఘం నిధులు, వరి కొనుగోలు వ్యవహారాలు, మహిళా సంఘం రుణాల పంపిణీ తదితర అంశాలపై సమాచారం కోరుతూ ఆంజనేయులు ఇటీవల ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేశానని ఆంజనేయులు తెలిపారు.13-04-2026న మహబూబ్‌నగర్ జిల్లా డీఆర్‌డీఏ కార్యాలయంలో సంబంధిత వివరాల కోసం అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు.ఆర్టీఐ దరఖాస్తును వెనక్కి తీసుకోవాలని బుక్‌కీపర్ ముష్టి శ్రీధర్ తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆంజనేయులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా సంఘంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, సంబంధిత అధికారులు విచారణ చేపడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .