హుజురాబాద్ కో-ఆప్షన్‌లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.
నాలుగింటినీ కైవసం.
Views: 9
On
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం నాలుగు స్థానాల్లో నాలుగింటినీ దక్కించుకుని పార్టీ శక్తిని చాటింది. హుజురాబాద్ రాజకీయ చరిత్రలో మున్సిపల్ స్థాయిలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి ఆధిపత్యం సాధించడం విశేషంగా మారింది.
ఈ విజయానికి నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎంపిక ప్రక్రియలో సమతుల్యం పాటిస్తూ బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యం కల్పించడమే కాకుండా మహిళలకు రెండు స్థానాలు కేటాయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా యువనేత ప్రణవ్ తన నాయకత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
కో-ఆప్షన్ సభ్యులుగా గొట్టే జమదగ్ని, మహమ్మద్ అబ్దుల్ అలీం, ఆలేటి సుశీల, ఫరీద బేగం ఎంపికయ్యారు. ఈ మొత్తం ప్రక్రియను సమన్వయం చేస్తూ వొడితల ప్రణవ్ ముందుండి నడిపించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, ఈ విజయానికి సహకరించిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి , పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బొమ్మ , జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ , దుద్ధిల్లా శ్రీధర్ బాబు , ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరావు, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి లభించిన ఈ విజయం హుజురాబాద్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments