అంబేద్కర్ జయంతి వేడుకలు.

అంబేద్కర్ జయంతి వేడుకలు.

నాచారం, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు): 

మాల మిత్ర సంఘం ఆధ్వర్యంలో మీర్పేట్ హెచ్‌బి కాలనీ మదర్ డెయిరీ పార్క్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ ప్రసంగాలు చేపట్టారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి ఈసిల్ చౌరస్తాలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు ఘటించారు.ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ శాఖ అధికారులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ పాల్గొన్న వారితో రోడ్డు భద్రత ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమం లో మహా మాల మిత్ర సంఘం కమిటీ సభ్యులు అధ్యక్షుడు నరేందర్ కుమార్, ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాశ్, ఖజాంచి జగదీశ్వర్ రావు, సలహాదారు శ్రీనివాస్ జెతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు నరేందర్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, న్యాయం, సోదరభావం పెంపొందించేందుకు డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .