క్రీస్తు త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే.

విశ్వశాంతి విద్యాలయంలో ముందస్తు నిర్వహణ.

క్రీస్తు త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే.

సత్తుపల్లి, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకునే పవిత్ర దినం గుడ్ ఫ్రైడే అని పట్టణంలో విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా పాఠశాలలో గురువారం ముందస్తుగా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, దయ, సహనం వంటి విలువలపై ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే మనుషులకు కష్టకాలంలో ధైర్యంగా ఉండటం, ఇతరులను క్షమించడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి గొప్ప గుణాలను నేర్పుతుందని పేర్కొన్నారు. విద్యతో పాటు నైతిక, మానవీయ విలువలు కూడా సమానంగా అవసరమని విద్యార్థులకు సూచించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం నరుకుళ్ల సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.IMG-20260402-WA0087

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .