నారాయణ పాఠశాలలో ఘనంగా స్నాతకోత్సవం

నారాయణ పాఠశాలలో ఘనంగా స్నాతకోత్సవం

_విద్యార్థులకు పట్టాలు ప్రదానం 

– భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

తార్నాక, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

తార్నాకలోని నారాయణ పాఠశాలలో స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం బాలపరమేశ్వరావు హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, విద్యార్థులు ఒక దశ నుంచి మరొక దశకు అడుగుపెడుతున్న ఈ సందర్భం ఎంతో కీలకమని తెలిపారు. కేజీ నుంచి ప్రాథమిక విద్యకు, అలాగే ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత తరగతులకు వెళ్లే ఈ మార్గంలో స్నాతకోత్సవం ఒక ముఖ్య ఘట్టమని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలను సాధించాలని ఆకాంక్షించారు.పాఠశాల ప్రిన్సిపాల్ పర్వీన్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ మరెన్నో విజయాలు సాధించాలని సూచించారు. తమ ప్రతిభతో సమాజంలో మంచి స్థానం సంపాదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ నారాయణ పాఠశాలల పదవ తరగతి ఇంచార్జ్ ముంతాజ్, ఆర్ & డి సభ్యులు మనోహర్, మహేశ్వరి, మీనా, కోఆర్డినేటర్లు ఆజాద్, లక్ష్మీభవాని, నూర్, ఏడి సురేష్, వి.పీ సరిత, షాహీన్, ఏఓ మహేందర్, పీఈటీ నరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ
చిల్పూర్,ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిల్పూర్ మండలంలో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని...
సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి... 
జిల్లాలో విజయవంతంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ ... 
జమ్మికుంట గణేష్ నగర్‌లో దివ్య హనుమాన్ పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
పట్టు చీర మహోత్సవానికి హాజరైన చిన్నారెడ్డి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు జమ్మికుంటలో మంచి స్పందన
పెద్ద తండలో సన్న బియ్యం పంపిణీ…