చర్లపల్లి ఎంఆర్‌ఆర్‌ కాలనీలో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

చర్లపల్లి ఎంఆర్‌ఆర్‌ కాలనీలో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

_మురుగు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం 

– ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

చర్లపల్లి, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్‌లోని ఎంఆర్‌ఆర్‌ కాలనీలో డ్రైనేజీ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. కాలనీలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మురుగు నీటి సమస్యను పరిష్కరించేందుకు ఈ పనులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్థానిక ప్రజల సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంటుందని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు. పనులు పూర్తయ్యాక కాలనీలో మురుగు నీటి సమస్య పూర్తిగా తగ్గి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, శివరామ్ రెడ్డి, శ్రీనివాస్, పత్తి రామ్ రెడ్డి, మల్లారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ భాస్కర్ రెడ్డి తదితర పార్టీ నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .