జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణికి సత్కారం.

విశ్వశాంతి విద్యాలయంలో ఘనాభినందన.

జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణికి సత్కారం.

సత్తుపల్లి, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కొలపనేని గగనశ్రీని సోమవారం విశ్వశాంతి విద్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలలో అండర్–17 విభాగంలో నాలుగో స్థానం సాధించడం ద్వారా ఆమె ప్రతిభను చాటుకున్నారు.
గత సంవత్సరం విశ్వశాంతి విద్యాలయంలో 10వ తరగతి పూర్తి చేసిన గగనశ్రీ తన పాఠశాలకు విచ్చేసిన సందర్భంగా ప్రిన్సిపాల్ పసుపులేటి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఆమెను అభినందించి సత్కరించారు.
ఈ సందర్భంగా గగనశ్రీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో అండర్–17 విభాగంలో సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు సాధించడం ద్వారా జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. ఒడిశాలో జరిగిన ఆల్ ఇండియా స్థాయి పోటీలలో నాలుగో స్థానం పొందడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో నిరంతరం సాధన కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గగనశ్రీతండ్రి అనిల్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. IMG-20260316-WA0042IMG-20260316-WA0043

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .