రంజాన్  పవిత్రతను ప్రతిబింబించిన ఇఫ్తార్ విందు

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన నందిమల్ల త్రినాథ్

రంజాన్  పవిత్రతను ప్రతిబింబించిన ఇఫ్తార్ విందు

వనపర్తి,మార్చ్14(తెలంగాణ ముచ్చట్లు):

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండల కేంద్రంలోని మసీద్‌లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకుడు అడ్వకేట్ నందిమళ్ళ త్రినాథ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందిమళ్ళ త్రినాథ్ ముదిరాజ్ హాజరై ముస్లిం సోదరులకు రమజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రమజాన్ మాసం ఉపవాసం, ప్రార్థనలు, దానం, సహనానికి ప్రతీకగా నిలిచే పవిత్ర కాలమని అన్నారు.సమాజంలో ప్రేమ, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం పెంపొందించడంలో ఇలాంటి ఇఫ్తార్ విందులు ముఖ్య పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలు కలిసి పాల్గొనే ఈ కార్యక్రమాలు సామాజిక ఐక్యతను మరింత బలపరుస్తాయని తెలిపారు.అదేవిధంగా మైనార్టీ సోదరులందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్ష విరమణలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి గ్రామ కాంగ్రెస్ నాయకులు సూర్య  రవి, మాజీ జడ్పిటిసి సభ్యులు కొమ్ము వెంకటస్వామి, వార్డు సభ్యులు కొమ్ము సతీష్, ఆశన్న జ్యోతి, నీలం రవి, రఫీ, మాజీ ఉపసర్పంచ్ జావేద్, ప్రసాద్, మెడికల్ రఘు, వహీద్, మైనారిటీ సెల్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News