నిరుపేదలకు అండగా 'లైఫ్ లైన్ ఫౌండేషన్': 

రంజాన్ రేషన్ కిట్ల పంపిణీ

నిరుపేదలకు అండగా 'లైఫ్ లైన్ ఫౌండేషన్': 

​ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు)

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని నిరుపేద కుటుంబాలకు లైఫ్ లైన్ ఫౌండేషన్ తమ ఉదారతను చాటుకుంది. నగరంలోని 14వ డివిజన్ పరిధిలో ఉన్న గొల్లగూడెం మరియు రాజన్నపేట కాలనీలలో నివసిస్తున్న నిరుపేదలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ రేషన్ కిట్లను పంపిణీ చేశారు.
​ఈ సందర్భంగా లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షేక్ జానీమియా మాట్లాడుతూ, పండుగ వేళ ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో తమ సంస్థ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యతని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వాలంటీర్లు షేక్ నజీరుద్దీన్, షేక్ గౌస్ మియా, షేక్ నజీర్, షేక్ కన్నం సాహెబ్, షేక్ చిన్న జానీ మియా, షేక్ షరీఫ్, ఇమామ్, మదర్ సాహెబ్, జానిమియా తదితరులు పాల్గొని పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. తమకు రేషన్ కిట్లు అందజేసినందుకు కాలనీ వాసులు ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .