పదో తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి

శంకర్ గౌడ్ వనపర్తి జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు   

పదో తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి

వనపర్తి,మార్చి13(తెలంగాణ ముచ్చట్లు):

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో వనపర్తి జిల్లా విద్యార్థిని, విద్యార్థులకు సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.పరీక్షల్లో విద్యార్థులు విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు.కష్టపడి చదివిన విషయాలను ప్రశాంతంగా, ఆసక్తితో రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.సమయపాలన పాటిస్తూ ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.అలాగే ప్రశ్నపత్రంలో సులభమైన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాయాలని తెలిపారు. హాల్ టికెట్ నంబర్ మరియు ప్రశ్న నంబర్లను సరిగా రాసి ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్ చేస్తూ, సంక్షిప్తంగా సమాధానాలు రాయాలని తెలిపారు.గైడ్లపై ఆధారపడకుండా స్వయంగా అర్థం చేసుకున్న విషయాలను రాయడానికి ప్రయత్నించాలన్నారు. ఏ ప్రశ్నను వదలకుండా జాగ్రత్తగా సమాధానాలు రాయాలని, పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వంటివని పేర్కొన్నారు.విద్యార్థులు పరీక్షలను బాగా రాసి తమ తల్లిదండ్రులు, పాఠశాలలు మరియు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .